
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సిల్వర్ స్క్రీన్ మీదే కాదు స్మాల్ స్క్రీన్ పై కూడా తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. తెలుగులో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ దానికి హోస్ట్ గా ఎన్.టి.ఆర్ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. మొదటి ఎపిసోడ్ అదరగొట్టిన తారక్ ఈ శని ఆదివారాల్లో కూడా ఆడియెన్స్ మెప్పు పొందాడు. ఇంకా చెప్పాలంటే ఈ షో శని ఆదివారల్లోనే ఆడియెన్స్ ను బాగా అలరిస్తుందని అంటున్నారు.
ఇక వారం మొత్తం నీరసంగా అనుకున్న ప్రోగ్రాం కాస్త హుశారెత్తేలా చేశాడు తారక్. వారం ముగిసింది కంటెస్టంట్స్ లో ఒకరు ఎలిమినేషన్ అవ్వాలి. అందరు కలిసి జ్యోతిని బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు పంపించేశారు. సోమవారం నుండి శుక్రవారం వరకు ఏదో అలా అలా సాగినా శని, ఆదివారాల్లో వచ్చిన ఎన్.టి.ఆర్ మాత్రం దుమ్ముదులిపేశాడని చెప్పాలి.