నేను లోకల్ డైరక్టర్ తో చరణ్..!

నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చి ఈ ఇయర్ సూపర్ హిట్ కొట్టిన సినిమా నేను లోకల్. నక్కిన త్రినాధరావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో మనోడి టాలెంట్ అందరికి తెలిసేలా చేసింది. ఇక ఈ సినిమా హిట్ అవడంతో దిల్ రాజు మరో సినిమా ఆ దర్శకుడికి ఆఫర్ ఇచ్చాడు. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో డిజె హిట్ అందుకున్న హరిష్ శంకర్ చరణ్ తో సినిమా చేయాలని అనుకున్నాడు.

అయితే చరణ్ మాత్రం తనకు నక్కిన త్రినాధ రావు డైరక్షన్ లో సినిమా చేయాలని ఉందని అన్నాడట. అంతేకాదు మంచి కథ ఉంటే అతని డైరక్షన్ లో సినిమా చేసేందుకు తాను రెడీ అన్నాడట చరణ్. హరిష్ శంకర్ ను కాదని నేను లోకల్ డైరక్టర్ తో చరణ్ సినిమా ఓకే చేయడం అర్ధం కాక దిల్ రాజు షాక్ అయ్యాడట. 

ప్రస్తుతం రాం చరణ్ సుకుమార్ డైరక్షన్ లో రంగస్థలం 1985 సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత ఎవరితో సినిమా చేయాలి అన్నది ఇంకా నిర్ణయించుకోలేదు. ఇక దిల్ రాజుతో కూడా చరణ్ ఎవడు సినిమా చేశాడు ఆ తర్వాత ఆ ప్రొడక్షన్ లో సినిమా చేసే అవకాశం రాలేదు.