ఐ లవ్ ఇండియా.. ఐ హేట్ ఇండియన్స్..!

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ సెలబ్రిటీస్ లో ముందు విచారణలో పాల్గొన్న పూరి ఈరోజు ఓ ప్రముఖ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తనకు తెలిసి శత్రువులు లేరని.. అయితే తన మీద ఇలాంటి ఆరోపణలు చేయడం వారి పనే అని చూచాయగా చెప్పుకొచ్చాడు. ఇక తన విచారణ టైంలో పూరికి ఇండస్ట్రీ కూడా సపోర్ట్ గా నిలిచిందని అన్నారు.  

తనకు దేశం మీద చాలా గౌరవం ఉందని. అందుకే జనగణమన కథ రాశానని.. నా లాంటి దేశం మీద ప్రేమ ఉన్న వారు మాత్రమే తీయగలిగే సినిమా అదని అన్నారు పూరి. అయితే ఆ సినిమా టైటిల్ జనగణమన అయినా దాని ఉపశీర్షికగా ఐ లవ్ ఇండియా.. ఐ హేట్ ఇండియన్స్ అని పెట్టనున్నాడట. చూఒస్తుంటే పూరి నిజంగానే ఏదో సంచలనం సృష్టించనున్నాడని చెప్పొచ్చు. ప్రస్తుతానికి పూరి మాటలని బట్టి చూస్తుంటే తనకు డ్రగ్స్ కు ఎలాంటి సంబంధం లేదనిపిస్తుంది. అయితే ఒకవేళ ఇంత బిల్డప్ ఇచ్చి డ్రగ్స్ కేసులో చిక్కుకుంటే మాత్రం పూరి ఇమేజ్ చాలా డ్యామేజ్ అవుతుంది.