
టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తన ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ సొంతం చేసుకుంది. మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న స్పైడర్ మూవీలో రకుల్ నటిస్తుండగా ఆ షూటింగ్ లో మురుగదాస్ ను ఇంప్రెస్ చేసిన రకుల్ ఆ తర్వాత సినిమాలో కూడా ఛాన్స్ దక్కించుకుంది. మురుగదాస్ ఇళయదళపతి విజయ్ తో చేయబోయే హ్యాట్రిక్ సినిమాలో రకుల్ ఛాన్స్ కొట్టేసింది.
అసలైతే ముందు ఈ సినిమాలో సమంతను సెలెక్ట్ చేశారు. కాని సమంత డేట్స్ కష్టమవుతున్న సందర్భంలో ఆమె బదులు రకుల్ ను ఆ ప్రాజెక్ట్ లో తీసుకున్నారట. తెలుగులో ఆల్రెడీ టాప్ హీరోలతో నటిస్తున్న రకుల్ తమిళంలో కూడా అదే రేంజ్ లో స్టార్స్ ఛాన్సెస్ అందుకుంటుంది. ఇప్పటికే అక్కడ ఒకటి రెండు సినిమాల్లో నటించిన రకుల్ విజయ్ సినిమాతో అక్కడ హాట్ టాపిక్ అయ్యింది.