నాని కృష్ణార్జున యుద్ధం కథ ఇదేనట..!

నాచురల్ స్టార్ నాని మేర్లపాక గాంధి సినిమాలో నటిస్తున్న సినిమా కృష్ణార్జున యుద్ధం. 2018 రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేస్తాడని తెలుస్తుంది. సినిమా కథ ఇదేనంటూ ఫిల్మ్ నగర్లో ఓ లైన్ వినిపిస్తుంది. కృష్ణ, అర్జున్ అనే రెండు పాత్రల్లో కనిపించనున్న నాని ఒకరు తిరుపతిలో మాస్ కుర్రాడిలా.. మరొకరు ప్యారిస్ లో క్లాస్ అబ్బాయిగా కనిపిస్తాడట. ఇక వారిద్దరి జీవితంలో ఓ ట్విస్ట్ అది అదిరిపోయేలా ఉంటుందట.

మొత్తానికి అలా నాని కృష్ణార్జున యుద్ధం చేయబోతున్నాడు. ఈ సినిమా కథ వింటుంటే కింగ్ నాగార్జున నటించిన హలో బ్రదర్ సినిమా గుర్తుకురాక మానదు. మరి ఆ సినిమా స్పూర్తితో ఈ కథ రాసుకున్నాడో ఏమో కాని సినిమా ఫుల్ ఎంటర్టైనింగ్ గా వస్తుందట. ప్రస్తుతం వేణు శ్రీరాం డైరక్షన్ లో ఎం.సి.ఏ సినిమా చేస్తున్న నాని త్వరలో కృష్ణార్జున యుద్ధం సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు.