
బాహుబలిలో ప్రధాన పాత్ర దారుల్లో ఒకరైన కట్టప్ప ఆ సినిమాతో ఏ రేంజ్ క్రేజ్ సంపాదించాడో తెలిసిందే. సత్యరాజ్ తప్ప ఆ పాత్రకు ఎవరు అంతగా న్యాయం చేయలేరని అనిపించింది. అందుకే ప్రభాస్, రానా, రమ్యకృష్ణలతో పాటుగా కట్టప్ప పాత్ర చేసిన సత్య రాజ్ కు బాగా పేరొచ్చింది. ఇక అలాంటి సినిమాల్లో సత్యరాజ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాడు.
తమిళ బాహుబలిగా 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబడుతున్న సినిమా సంఘమిత్ర. సముద్ర డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో లీడ్ హీరోయిన్ ఎవరు అన్నది ఇంకా ఫైనల్ కాలేదు కాని సినిమాలో మిగతా పాత్రలు ఫిక్స్ చేస్తున్నారట. ముఖ్యంగా సత్యరాజ్ ను సినిమాలో కీలక పాత్రకు ఎంపిక చేశారని టాక్. ఇక సంఘమిత్ర టైటిల్ రోల్ కోసం హాన్సికను ఫైనల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శృతి హాసన్ ఈ సినిమా నుండి తప్పుకున్నాక లీడ్ హీరోయిన్ గా చేసేందుకు ఎవరు ముందుకు రావట్లేదు.