బల్గేరియాకు పవన్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ లో మూవీ ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా చిత్రయూనిట్ బల్గేరియాకు వెళ్ళింది. యూరప్ బ్యాక్ గ్రౌండ్ లో రాబోతున్న ఈ సినిమా వివిధ దేశాల్లో షూటింగ్ చేస్తారని తెలుస్తుంది. అక్కడే లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారట. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో కె.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సినిమా టైటిల్ పై రకరకాల పేర్లు వినపడ్డా ఫైనల్ గా ఒకటి ఫిక్స్ చేయలేదు. అయితే ఈ షెడ్యూల్ ముగించుకుని వచ్చాక ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేసే అవకాశాలున్నాయట. క్రేజీ బ్యూటీస్ కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీకి అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సెప్టెంబర్ కల్లా షూటింగ్ పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్న చిత్రయూనిట్ సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట.