మీడియా చేసిన పనికి తీవ్రంగా హర్ట్ అయిన పూరి..!

డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా పూరి జగన్నాథ్ ను సిట్ అధికారులు నిన్న ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు విచారణ జరిపించారు. ఇక విచారణ పూర్తవడంతో పూరిని పంపించేశారు. పూరి నుండి కీలక సమాచారం తీసుకున్నామని అన్నారు. ఇక పూరి విచారణలో ఉన్న ఆ 11 గంటలు మీడియా చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.

పూరిని పోలీసులు ఎలాంటి ప్రశ్నలు అడిగారు.. వాటికి పూరి ఏమని సమాధానం ఇస్తున్నారు అంటూ ఓ రోజుమొత్తం అన్ని ఛానెళ్లు ఈ న్యూస్ కవర్ చేశాయి. అయితే ఈ విషయం పట్ల మీడియా తనకి బాధకలిగించిందని పూరి అన్నారు. విచారణ అనంతరం తన సోషల్ బ్లాగ్ లో ఓ వీడియో మెసేజ్ పెట్టారు పూరి. కెల్విన్ తో తనకు పరిచయాలు లేవని పోలీసు వారికి అదే చెప్పానని.. ఇక మీదట ఈ కేసులో పోలీస్ వారు ఎప్పుడు విచారణకు రమ్మన్నా తాను వస్తానని అన్నారు. పోలీసులంటే తనకు గౌరవమని అందుకే తను చాలా సినిమాలు పోలీస్ బ్యాక్ డ్రాప్ లోనే తీశానని.. తాను ఎప్పటికి ఇల్లీగల్ పనులు చేయనని.. అయితే విచారణ జరుగుతుండగా మీడియా చేసిన ప్రోగ్రామ్స్ తనని చాలా బాధపెట్టాయని.. తన జీవితాన్ని నాశనం చేసారని అన్నారు పూరి. మీడియా మిత్రులంతా తనకు తెలిసిన వారే అని వారే సరైన సమయంలో తన మీద కల్పిత కథలు అల్లారాని అన్నారు. పూరి విచారణ సమయంలో మీడియా మీద వచ్చిన ఎపిసోడ్స్ అతన్ని హర్ట్ చేసినట్టు కనిపిస్తుంది.        

తన ఫ్యామిలీ మెంబర్స్ వాటిని చూస్తి ఏడుస్తున్నారని మీడియా మీద తన బాధను వెళ్లగక్కారు పూరి. జర్నలిజం మీద ఇష్టంతో ఇజం సినిమా చేశానని కాని మీడియా మాత్రం తనని చాలా హర్ట్ చేసిందని వీడియో మెసేజ్ లో అభిప్రాయపడ్డారు పూరి.