రోడ్ల మీద హీరోయిజం వద్దు : స్టైలిష్ స్టార్

ఈమధ్యనే డిజె దువ్వాడ జగన్నాధం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆ సినిమాలో తన మాటల్లో ప్రతిసారి సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇద్దామని అంటుంటాడు. ఇక సినిమాలోనుండి బయటకు వచ్చినా సరే సభ్య సమాజానికి మెసేజ్ ఇచ్చేస్తున్నాడు బన్ని. ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చే కార్యక్రమంలో అటెండ్ అయిన బన్ని ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలని కోరాడు.

ట్రాఫిక్ నిబంధలను అతిక్రమించకుండా వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అంతేకాదు వాహనదారులు వేగంగా వెళ్లి హీరోయిజం చూపించాల్సిన అవసరం లేదని అన్నారు అల్లు అర్జున్. అలా నడపడంలో హీరోయిజం ఉండదని అన్నారు. ఇక ఇదే కార్యక్రమంలో రాజమౌళి కూడా పాల్గొని అన్ని రంగాల్లో ప్రపంచ దేశాలతో పోటీ పడాలనుకుంటుందని కాని ఇక్కడ రోడ్లు సరిగా ఉండవని అభిప్రాయపడ్డారు. ట్రాఫిక్ రూల్స్ అందరు పాటించాలని వాటి ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని చెప్పుకొచ్చారు.