
హ్యాపీడేస్ తీసిన శేఖర్ కమ్ముల ఆ తర్వాత వచ్చిన సినిమాలతో తేలిపోయాడు. అనామిక సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న శేఖర్ కమ్ముల ప్రస్తుతం ఫిదాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్, సాయి పల్లవి లీడ్ రోల్స్ లో నటించారు. సినిమా అంతా శేఖర్ కమ్ముల మార్క్ తోనే వస్తుందని టాక్.
అయితే మొదటి ట్రైలర్ అంతగా ఆకట్టుకోకపోయినా రీసెంట్ గా రిలీజ్ అయిన సెకండ్ ట్రీలర్ సినిమా మీద అంచనాలను పెంచేసింది. ఫిదా మూవీ హిట్ కొడితేనే శేఖర్ కమ్ములకు మళ్లీ అవకాశాలొచ్చేది. ప్రస్తుతం వరుణ్ తేజ్ కూడా హిట్ కొట్టాలని కసి మీద ఉన్నాడు. మరి ఈ ఇద్దరికి హిట్ చాలా అవసరమైన ఈ సినిమా వారికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.