
టాలీవుడ్ డ్రగ్స్ డొంక కదిలేలా చేసిన కెల్విన్ ఇచ్చిన సమాచారం ప్రకారం టాలీవుడ్ లో 12 మంది సెలబ్రిటీస్ కు సిట్ నోటీసులు పంపించడం జరిగింది. అయితే ఈరోజు సిట్ అధికారుల ముందు దర్శకుడు పూరి జగన్నాధ్ విచారణలో పాల్గొన్నారు. 10:30 నిమిషాలకు మొదలైన ఈ విచారణ పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. కెల్విన్ ఇచ్చిన సమాచారంతో కాకుండా పూరికి 100 ప్రశ్నలను అడిగే అవకాశాలున్నయట.
పూరి చెప్పిన సమాధానాలు కూడా ఒకటి రెండు బయటకు వచ్చాయి. కెల్విన్ తో ఓ ఈవెంట్ లో పరిచయం ఉన్నట్టు చెప్పిన పూరి రెండోసారి పబ్ లో కలుసుకున్నామని చెప్పాడట. అంతేకాదు తాను డ్రగ్స్ వాడలేదని కూడా పూరి విచారణలో చెబుతున్నట్టు ఎక్స్ క్లూజివ్ న్యూస్. ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ విచారణ సాగుతుందని అంటున్నారు. పూరి ఇంటరాగేషన్ మీద టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరు కన్నేసి ఉంచారు.
పోలీసు వారు మాత్రం వచ్చేది సెలబ్రిటీస్ కాబట్టి వారికి థర్డ్ డిగ్రీ లాంటివి చేయమని.. వారిని విఐపి లానే ట్రీట్ చేస్తామని చెప్పారు. పూరితో రెండు గంటల నుండి నిరంతరాయంగా విహారణ జరుగుతుంది. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.