
టాలీవుడ్ లో ప్రస్తుతం ఎవరిని కదిలించినా సరే డ్రగ్ మాఫియా గురించే మాట్లాడుతున్నారు. మొదటి లిస్ట్ లో 9 మంది సెలబ్రిటీస్ ను విచారణకు రావాల్సిందిగా నోటీసులు అందించారు. ఈ క్రమంలో లిస్ట్ లో లేని వారు కాకుండా కొంతమంది సెలబ్రిటీస్ మీద కూడా ఈ డ్రగ్స్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. ముఖ్యంగా దగ్గుబాటి వారసుడు రానా మీద డ్రగ్స్ రూమర్స్ హడావిడి చేశాయి.
దీనిపై స్పందించిన రానా తాను రోజు 20 కిలోమీటర్ల దాకా జాగింగ్ చేస్తానని.. షూటింగ్ లేకపోతే రోజంతా జిమ్ లోనే ఉంటానని అంటున్నాడు. అంతేకాదు తాను ప్రస్తుతం ఫిట్ గా ఉన్నానని.. అది మీకు తెలుసని.. తన ఫుడ్.. తన ప్రపంచమంతా పక్కన వాళ్లకు తెలుసని అంటున్నాడు రానా. తనని చూసి డ్రగ్స్ వాడుతారని ఎలా అనుకుంటారని అంటున్నాడు. రానా చెప్పిన మాటలను బట్టి చూస్తే కచ్చితంగా అతనికి డ్రగ్స్ రాకెట్ తో సంబంధం లేదనిపిస్తుంది. మరి అసలు నిజానిజాలు మరికొద్దిరోజుల్లో తెలుస్తాయి కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే.