
నాచురల్ స్టార్ నాని ఓ పక్క వరుస విజయాలతో దూసుకుపోతుంటే కింగ్ నాగార్జున ప్రయోగాలతో సిని లవర్స్ ను ఆకట్టుకుంటున్నాడు. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్ లో మల్టీస్టారర్ సినిమా వస్తే.. అబ్బో అదిరిపోద్ది కదా ప్రస్తుతం ఆ క్రేజీ కాంబినేషన్ సెట్ చేయడానికి చూస్తున్నారట. ఇప్పటికే ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథను ఫైనల్ చేయగా అతన్నే డైరక్షన్ చేయిద్దామా లేక వేరే ఎవరినైనా చూద్దామా అని ఆలోచిస్తున్నారట.
మొత్తానికైతే నాని నాగార్జున మల్టీస్టారర్ పక్కా అని తేలింది. దర్శకుడే కన్ఫాం అవ్వాలి. ఈ సినిమాపై అంచనాలను పెంచేలా కాంబినేషన్ సెట్ చేశారు. ప్రస్తుతం రాజు గారి గది-2లో నటిస్తున్న నాగార్జున అది ముగియగానే మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. నాగ చైతన్యతో రారండోయ్ వేడుక చూదాం నిర్మించిన నాగార్జున ప్రస్తుతం అఖిల్ విక్రం సినిమా బిజీలో ఉన్నాడు.