రవితేజ గురించి స్పందించిన తల్లి రాజ్యలక్ష్మి

కొద్దిరోజులుగా డ్రగ్స్ వ్యవహారంలో ప్రముఖుల పేర్లు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా డ్రగ్స్ కేసులో స్టార్ హీరో మాస్ మహరాజ్ రవితేజ పేరు కూడా వినిపించింది. పూరితో క్లోజ్ గా ఉండే వ్యక్తుల్లో రవితేజ కూడా ఉన్నాడు. అందుకే రవితేజ కూడా ఇందులో ఉంటాడని వార్తలొచ్చాయి. ఈ క్రమంలో తన కొడుకు మీద వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించింది రవితేజ తల్లి రాజ్యలక్ష్మి.

తమ్ముడు చనిపోయిన బాధలో ఉండగా రవితేజను ఈ డ్రగ్స్ కేసులో ఇరికించడం చాలా దారుణమని. అసలు తన కొడుకుకి సిగరేట్ అలవాటు కూడా లేదని సిగరెట్ తాగే వారికి కూడా రవితేజ క్లాస్ పీకుతాడని అన్నారు. ఎవరో కావాలని రవితేజ మీద తప్పుడు సమాచారం ఇచ్చారని. భరత్ చనిపోడానికి కూడా మత్తు మందులు కారణమని అన్నారు కాని అతను అన్ని మానేశాడని ఆన్నారు. బిగ్ బాస్ షోలో కూడా భరత్ సెలెక్ట్ అయ్యాడని ఆ ప్రయత్నంలో ఉండగానే చనిపోయాడని అన్నారు.