పవర్ స్టార్ ను దాటేసిన నాని..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను నాని దాటేయడమా.. టైటిల్ చూసి కచ్చితంగా షాక్ అయ్యే అవకాశం ఉంది. అయితే పవర్ స్టార్ క్రేజ్.. ఆ ఫాలోయింగ్ నానికి వచ్చే అవకాశం ఉందా లేదా అన్నది పక్కన పెడితే రికార్డుల విషయంలో ఎవరికి వారు తమ సత్తా చాటుతున్న నేపథ్యంలో ఓవర్సీస్ లో మిలియన్ మార్క్ చేరుకోవడంలో మాత్రం పవన్, ఎన్.టి.ఆర్ లను క్రాస్ చేశాడు నాని.

వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని ఓవర్సీస్ లో నాలుగు సినిమాలను మిలియన్ మార్క్ దాటించేశాడు. ఇదో రకంగా ఓవర్సీస్ లో నానికి ఉన్న క్రేజ్ అని చెప్పొచ్చు. అయితే ఈ రికార్డుల్లో నాని పవన్ కళ్యాణ్ కు క్రాస్ చేయడం విశేషం. ఈగ, భలే భలే మగాడివోయ్, నేను లోకల్ సినిమాలతో మిలియన్ మార్క్ అందుకున్న నాని రీసెంట్ గా రిలీజ్ అయిన నిన్ను కోరితో కూడా మిలియన్ క్లబ్ లో చేరాడు. ఈ రికార్డుతో నాని పవర్ స్టార్ ను బీట్ చేశాడు. ఇక పవన్ కళ్యాణ్ ఓవర్సీస్ లో కేవలం మూడు సినిమాలు (అత్తారింటికి దారేది, గోపాల గోపాల, సర్దార్ గబ్బర్ సింగ్) మాత్రమే మిలియన్ మార్క్ దాటించాడు.