పూరి స్పందన మీడియా కథనాలేనా..!

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఊహించని ట్విస్టులు జరుగుతున్నాయి. ఎవరెలా ఉన్నా అందరి నోట్లో దిగ్గజ దర్శకుడు పూరి జగన్నాధే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. పూరితో పాటే అతని గ్యాంగ్ కూడా ఈ కేసులో నోటీసులు అందుకున్నారని టాక్. ఇదిలా ఉండగా పూరి ఈ విషయంపై స్పందించాడు అంటూ నిజాలు బయట పెట్టే దమ్ము నాకుంది.. నేను చెప్పిన పేర్లు చెప్పినట్టుగా రాసే దమ్ము మీకుందా అని మీడియాకు చాలెంజ్ చేశాడని అన్నారు. ఈ విషయం పై పూరి క్లారిటీ ఇచ్చాడు.

తాను ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వలేదని.. ప్రస్తుతం తను చేస్తున్న పైసా వసూల్ మూవీని పనుల్లో బిజీగా ఉన్నానని ట్వీట్ చేశాడు. దమ్ముందా అంటూ పూరి స్పందనగా వచ్చిన వార్తలన్ని కచ్చితంగా మీడియా సృష్టే అని అంటున్నారు. ఇక ప్రస్తుతం తను మాత్రం ఒక్క ట్వీట్ తో సరిపెట్టినా ముందు ముందు ఏం జరుగుతుందో అని కాస్త ఎక్సయిటింగ్ గా ఉన్నారు సిని జనాలు.