కాజల్ ను అతనితో లింక్ పెట్టారు..!

తెలుగు తమిళ భాషల్లో ఫుల్ ఫాంలో ఉన్న కాజల్ అగర్వాల్ పీకల్లోతు ప్రేమలో ఉందని కోలీవుడ్ మీడియా కథనాలు సృష్టించింది. ఓ తెలుగు హీరోతో కాజల్ ప్రేమాయణం సాగిస్తుందని టాక్. ఇంతకీ ఆ హీరో ఎవరా అంటే నేనే రాజు నేనే మంత్రితో కాజల్ తో జతకట్టిన హీరో దగ్గుబాటి రానా. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరిందని అందుకే కాజల్ అతనితో ప్రేమలో పడిందని అంటున్నారు. దీనికి సాక్ష్యం ఎలాంటి వాడు వరుడిగా కావాలి అంటే కచ్చితంగా హైట్ ఉండలి.. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉండాలంటూ అచ్చం రానాని పోలిన క్వాలిటీస్ చెప్పేసిందట.  

అయితే కాజల్ చెప్పిన ఈ క్లూస్ తో రానాతోనే కాజల్ కు లింక్ పెట్టారు. కాని మళ్లీ ఈ వార్తలపై తన స్పందన తెలియచేసింది కాజల్. తను ఎక్సాంపుల్ గా చెప్పానే కాని రానాతో తనకు ఎలాంటి రిలేషన్ లేదని అన్నది. అంతేకాదు తను సర్జరీ చేయించుకుంటున్న వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదని అంటుంది కాజల్. నేనే రాజు నేనే మంత్రితో పాటుగా కళ్యాణ్ రాం ఎం.ఎల్.ఏ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది కాజల్.