అవును మేమిద్దరం రిలేషన్‌షిప్‌లో ఉన్నాం: సమంత

సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమలో పడిందనే విషయం అందరికీ తెలిసిందే. వారిద్దరూ కలిసి మెలిసి తిరుగుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల సమంత దీపావళి పండగనాడు రాజ్ నిడిమోరు ఇంటికి వెళ్ళి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి టపాసులు కాల్చి పండగ జరుపుకున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో అందరూ చూశారు.

ఇప్పుడు సమంత స్వయంగా రాజ్ నిడిమోరుతో సన్నిహితంగా ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ‘గత ఏడాది కాలంలో ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను’ అంటూ తాము రిలేషన్‌షిప్‌లో ఉన్నామని స్పష్టం చేశారు.

వారి ప్రేమ వ్యవహారం వారి కుటుంబ పెద్దల వరకు వచ్చేసింది కనుక త్వరలోనే వివాహ నిశ్చితార్ధం చేసుకొని పెళ్ళి పీటలు ఎక్కే అవకాశం ఉంది.

సమంత తన సొంత సినీ నిర్మాణ సంస్థ బ్యానర్‌ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై ‘మా ఇంటి బంగారం’ సినిమా ప్రకటించి చాలా కాలమే అయ్యింది. ఈ ఏడాది అక్టోబర్ 2న విజయదశమి నాడు పూజా కార్యక్రమం చేసి నందిని రెడ్డి దర్శకత్వంలో త్వరలో రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభించాబోతున్నారు. 

రాజ్ నిడిమోరు, డికెతో కలిసి దర్శకత్వం చేసిన ఫ్యామిలీ మ్యాన్-3 వెబ్‌ సిరీస్‌లో ఈ నెల 21న అమెజాన్ ప్రైమ్‌ టీవీలో విడుదల కాబోతోంది.