నాని మేర్లపాక గాంధి కృష్ణార్జున యుద్ధం..!

నాచురల్ స్టార్ నాని నిన్నుకోరి హిట్ అయ్యింది కదా అని రిలాక్స్ అవ్వకుండా తన తదుపరి సినిమాల పనిల్లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం నాని వేణు శ్రీరాం డైరక్షన్ లో ఎం.సి.ఏ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత మేర్లపాక గాంధి డైరక్షన్ లో నాని కృష్ణార్జున యుద్ధం సినిమా చేస్తున్నాడట.  


ఈ సినిమా టైటిల్ లోగో రిలీజ్ చేశాడు నాని. ఎం.సి.ఏ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ చేస్తారట. ఇక మేర్లపాక గాంధి కృష్ణార్జున యుద్ధం మాత్రం 2018 రిలీజ్ అని అంటున్నారు. ఎక్స్ ప్రెస్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న మేర్లపాక గాంధి తీసిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మరి వరుస హిట్లతో ఫుల్ ఫాంలో ఉన్న నానితో గాంధి చేయబోయే కృష్ణార్జున యుద్ధం ఎలా ఉండబోతుందో చూడాలి.