
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బుల్లితెర మీద బిగ్ బాస్ గా కనిపించబోతున్నాడు. స్టార్ మా బిగ్ బాస్ హోస్ట్ గా రేపటి నుండి తారక్ స్మాల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్తున్నాడు. అయితే రేపు మొదలవనున్న ఈ షోలో తారక్ అభిమానులకు సర్ ప్రైజ్ ఇస్తాడట. తన డ్యాన్స్ తో బిగ్ బాస్ ను స్టార్ట్ చేస్తాడని తెలుస్తుంది. ఓ పక్క తమిళంలో బిగ్ బాస్ రియాలిటీ షో మీద రకరకాల వాదనలు వినిపిస్తున్నా సరే వాటినేమి పట్టించుకోకుండా తారక్ ఈ షోకి సిద్ధమయ్యాడు.
ఇక ఇందులో కనిపించే సెలబ్రిటీస్ ఎవరు అన్నదాని మీద కొన్ని క్లూస్ వస్తున్నాయి. తేజశ్వి, సదా, రంభ, శ్రీముఖి లాంటి వారు ఈ షోలో పాటిస్పేట్ చేస్తున్నారని టాక్. మరి మొదటి ఎపిసోడ్ చాలా ప్రెస్టిజియస్ గా తెరకెక్కించారట. రేపు ఆన్ ఎయిర్ లో రాబోతున్న బిగ్ బాస్ తొలి ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో చూడాలి.