మెగా పవర్ స్టార్ రాం చరణ్ బుల్లి అభిమాని పరశురాం కామెర్ల కారణంగా మృతి చెందాడు. కొద్దిరోజులుగా కామెర్లతో బాధపడుతున్న పరశురాం సరైన వైద్యం తీసుకోక మరణించినట్టు తెలుస్తుంది. ఇక రెండు సంవత్సరాల క్రితం చరణ్ ను కలిసిన ఈ బుడతడు మగధీరలోని రాం చరణ్ డైలాగులతో చరణ్ ను ఇంప్రెస్ చేశాడు. తన చదువుకి కావాల్సిన డబ్బుని తాను ఇస్తానని చరణ్ మాటిచ్చారు.
అంతేకాదు చరణ్ గిఫ్ట్ గా ఓ టీ షర్ట్ కూడా ఇచ్చాడని తెలుస్తుంది. అయితే కామెర్లతో బాధపడుతున్న పరశురాం వైద్యం చేయిస్తున్నా రోగం ముదరడంతో తుది శ్వాస విడిచాడు. మెగా అభిమానులంతా అభిమాని మృతికి నివాళులు అర్పించారు. అయితే ఈ విషయం చరణ్ దాకా వెళ్లిందా లేదా అన్నది ఇంకా తెలియలేదు. చరణ్ కు తెలిస్తే కచ్చితంగా తన తరపున ఓ మెసేజ్ పాస్ చేసేవాడని అంటున్నారు.