
టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్న డ్రగ్ ఎడిక్షన్ గురించి రెండు రోజులుగా పెద్ద దుమారమే నడుస్తుంది. ఇప్పటికే పోలీసు వారు కొందరు సిని ప్రముఖులకు నోటీసులు పంపించారట కూడా. అయితే ఈ హంగామా అసలు డ్రగ్స్ వాడే వారెవరు వాడని వారు ఎవరు అన్నది తేలలేదు. మాకు నోటీసులందాయి విచారణకు సిద్ధమే అని కొందరంటుంటే డ్రగ్స్ కేసులో తమ పేర్లు వినబడుతున్నాయి కాని వాటికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని కొందరు అంటున్నారు.
వారిలో ముఖ్యంగా సహ నటుడు, హీరోగా కొన్ని సినిమాలు చేసిన నందు తనకు డ్రగ్స్ అంటే తెలియదని. డ్రగ్స్ ఎడిక్షన్ లిస్ట్ లో తన పేరు ఉండటం చాలా బాధగా ఉందని అంటున్నాడు. ఇక పోలీసు వారికి తన పూర్తి సహకారం ఉంటుందని తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమే అని అంటున్నాడు నందు. సింగర్ గీతా మాధురి భర్త అయిన నందు ఇదవరకు కూడా డ్రగ్స్ వాడుతున్నట్టు వార్తలొచ్చాయి. అప్పుడు కూడా నందు తనని ఆ గొడవల్లోకి లాగొద్దని అన్నాడు.