
జబర్దస్త్ షోతో స్మాల్ స్క్రీన్ పై సూపర్ పాపులర్ అయిన ఆది తన కామెడీ పంచ్ లతో ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్నాడు. ఇక కొద్దికాలంగా ఆది ఓ సీరియల్ యాక్టర్ తో ప్రేమలో ఉన్నాడని టాక్ వచ్చింది. ఇక నిన్నటి నుండి సోషల్ మీడియాలో ఆది పెళ్లి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇక అది చూసి ఆది పెళ్లి అయ్యిందంటూ ఒకటే హడావిడి చేశారు. కాని ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఆది పెళ్లి మ్యాటర్ అంతా తుస్సని అంటున్నారు.
అల్లరి నరేష్ హీరోగా మేడ మీద అబ్బాయి సినిమాలో ఆది కూడా ఓ రోల్ చేస్తున్నాడు. ఆ సినిమాలో భాగంగా ఆది పెళ్లి సీన్ ఉంటుందట. ఆ ఫోటో లీక్ అవగా నిజంగానే ఆది పెళ్లి అయ్యిందని సోషల్ మీడియాలో పలు వార్తలు వచ్చాయి. ఇది విని ఆది కూడా షాక్ అయ్యాడని తెలుస్తుంది. కొందరైతే ప్రేమించిన సీరియల్ నటినే ఆది పెళ్లి చేసుకున్నాడు అంటూ ఉత్సాహం చూపించింది. మరి ఈ విషయం గురించి ఆది కచ్చితంగా జబర్దస్త్ స్కిట్ లో పంచులు వేస్తాడని అంటున్నారు.