
మెగా పవర్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం సుకుమార్ డైరక్షన్ లో రంగస్థలం 1985 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివతో చరణ్ సినిమా ఉండబోతుంది. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా 2018 సమ్మర్ లో స్టార్ట్ చేస్తారట. అయితే ఈ సినిమా కోసం కొరటాల శివ 14 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని తెలుస్తుంది. స్టార్ సినిమాలకు సోషల్ మెసేజ్ తో కూడిన కథలను అందిస్తూ సూపర్ హిట్ కొడుతున్న కొరటాల శివతో సినిమా చేయాలని ప్రతి స్టార్ హీరో ఉత్సాహపడుతున్నాడు.
అందుకే కొరటాల శివ కూడా అదే రేంజ్ లో డిమాండ్ చేస్తున్నాడట. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ సినిమాల తర్వాత మహేష్ తో భరత్ అను నేను సినిమా చేస్తున్న కొరటాల శివ చరణ్ సినిమాను తన హిట్ సినిమాల స్థానంలో నిలబెట్టాలని చూస్తున్నాడు. సుకుమార్ సినిమా పూర్తి కాగానే కొద్దిపాటి గ్యాప్ తో చరణ్ సినిమా స్టార్ట్ చేయబోతున్నారట. మరి అంచనాలను మించేలా ఈ సినిమా ఉంటుందో లేదో చూడాలి.