బెస్ట్ కాంపిటీటర్ అవుతాడా..!

టాలీవుడ్ లో ఎంతోమంది మ్యూజిక్ డైరక్టర్స్ ఉన్నా క్లిక్ అయ్యింది మాత్రం ఒకరిద్దరే.. కుదిరితే దేవి శ్రీ ప్రసాద్ లేకపోతే థమన్. ఈ ఇద్దరు కాకుంటే అనూప్ రూబెన్స్.. అతను వద్దనుకుంటే గోపి సుందర్ ఇలా మ్యూజిక్ డైరక్టర్స్ విషయంలో దర్శక నిర్మాతలు ఎప్పుడూ హడావిడి ఉండనే ఉంటుంది. తెలుగు తెర మీద తమిళ సంగీత కెరటాలు వచ్చినట్టే వచ్చినా అవి అంతగా సక్సెస్ అవలేదు.

ఇక ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ మాత్రం టాలీవుడ్ పై పట్టు సాధించాలని చూస్తున్నాడు. కోలీవుడ్ లో కుర్ర హీరోల నుండి సూపర్ స్టార్ సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్న అనిరుధ్ తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. త్రివిక్రం సినిమాలో సాంగ్స్ కు ఎంత ప్రత్యేకత ఉంటుందో తెలిసిందే. అనిరుధ్ కూడా తన బెస్ట్ అవుట్ పుట్ ఇస్తున్నాడట.  

పవన్ తో చేస్తున్న సినిమా హిట్ అయితేనే ఇక్కడ సినిమాలు చేస్తానని చాలెంజ్ చేస్తున్నాడు అనిరుధ్. సినిమా ఫలితం మీద మ్యూజిక్ ప్రభావం చూపిస్తేనే తాను ఇక్కడ సినిమాలు కంటిన్యూ చేస్తానని లేదంటే కోలీవుడ్ కే పరిమితమవుతా అంటున్నాడు అనిరుధ్. మరి పవన్ తో సినిమా ఈ మ్యూజిక్ డైరక్టర్ ఫేట్ డిసైడ్ చేస్తుందన్నమాట.