
బాహుబలి సినిమా ప్రపంచం నలుమూలల్లోకి వెళ్లింది అని చెప్పడానికి మరో అద్భుతమైన ఉదాహరణ ఇది. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి మొదటి రెండు పార్టులు సృష్టించిన సంచలనాలు కలెక్ట్ చేసిన వసూళ్లు తెలిసిందే. అయితే వీటి అన్నిటికన్నా కోట్ల మంది హృదయాలను గెలుచుకుందని మాత్రం చెప్పొచ్చు. కేవలం ఇండియాలోనే కాదు ఇండోనేషియాలో కూడా బాహుబలి క్రేజ్ ఎలా ఉందో ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది.
ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అంటే ఓ ఇండోనేషియా బ్యాండ్ ట్రూప్ తమ ప్రదర్శనలో భాగంగా బాహుబలి-2 లోని సాహోరే బాహుబలి సాంగ్ పాడారు. అచ్చం సినిమాలో ఎలా ఉందో అలానే ఆలపించి చూపరులను ఆకట్టుకున్నారు. భాష రాకపోయినా సరే భావం మిస్ అవ్వకుండా కేవలం సినిమా మీద ఉన్న ప్యాషన్ తో వారు ఆ పాటను తన్మయత్వంతో పాడారు. బాహుబలి సాధించిన ఘనత వసూళ్ల పరంగా ఎంత చెప్పుకున్నా సరే ఇలా ఏ సంబంధం లేని వారిని కూడా తెలుగు పాట పాడేలా చేసినందుకు మరొక్కసారి మన దర్శక ధీరుడు రాజమౌళికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.