చిరు 151లో క్రేజీ హీరో..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ సినిమా ఖైది నంబర్ 150 సూపర్ హిట్ అవగా ఆ తర్వాత 151వ సినిమాగా ఉయ్యాలవాడ నర సింహారెడ్డి బయోపిక్ ను సినిమా చేస్తున్నాడు చిరంజీవి. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు ఆగష్టు 15న ముహుర్తం పెట్టనున్నారట. 150 ఏళ్ల క్రితం జరిగిన ఈ కథను భారీ స్థాయిలో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఇక ఈ సినిమాలో చిరుతో పాటుగా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా నటిస్తారని తెలుస్తుంది.

కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్, నయనతార హీరోయిన్స్ గా నటిస్తారని తెలుస్తుంది. సినిమాలో ప్రత్యేక పాత్రలో ఎవరైతే బాగుంటారని చూసి ఉపేంద్రని ఫైనల్ చేశారట. తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఉపేంద్ర 2015లో త్రివిక్రం అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించారు. మరి చిరు ఉయ్యాలవాడలో ఉపేంద్ర మరోసారి తన విశ్వరూపాన్ని చూపిస్తారని ఆశించవచ్చు.