ఫిదాకి దిల్ రాజు కత్తెరలు..!

వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వస్తున్న సినిమా ఫిదా. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా జూలై 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుణ్ తేజ్ కెరియర్ ను డిసైడ్ చేసే ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు దిల్ రాజు అందుకే సినిమాలో కొన్ని అనవసర సీన్స్ ను ట్రిం చేస్తున్నారని టాక్. శేఖర్ కమ్ముల డైరక్షన్ గురించి తెలిసిందే.. స్లో నేరేషన్ లో కూడా ఆడియెన్స్ ను కనెక్ట్ చేసే స్క్రీన్ ప్లే ఆయన సొంతం.

అయితే దిల్ రాజు మాత్రం ఈ సినిమాకు తను చెప్పినట్టుగా స్క్రీన్ ప్లే రాయమన్నారట. శేఖర్ కమ్ముల కూడా దానికి ఓకే చెప్పడంతో సినిమా తీశారు. ఇక ఎడిటింగ్ లో కూడా దిల్ రాజు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని టాక్. ల్యాగ్ అయ్యే సీన్స్ అన్ని కట్ చేయమని దిల్ రాజు చెప్పారట. మరి దిల్ రాజు అతి జాగ్రత్త సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.