
బాహుబలితో నేషనల్ వైడ్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ప్రభాస్ సుజిత్ డైరక్షన్ లో సాహో సినిమా చేస్తున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్లో రాబోతున్న ఈ సినిమా 150 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతుంది. సినిమాలో హీరోయిన్ గా అనుష్కను తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ కొత్తగా కామెడీ కూడా ట్రై చేస్తాడట.
డైరక్టర్ సుజిత్ హీరో పాత్ర అంతా కామెడీగా డిజైన్ చేశాడట. అయితే ఇదవరకు ప్రభాస్ కామెడీ రోల్ తో చేసిన సినిమాలన్ని నెగటివ్ రిజల్ట్ వచ్చేలా చేశాయి. మరి బాహుబలి తర్వాత సాహో లాంటి సినిమాలో ప్రభాస్ ఇలాంటి ప్రయోగాలు అవసరమా అంటున్నారు యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్. తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రబాస్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుందని చెబుతున్నాడు సుజిత్. స్కై ఫైట్ తో కూడిన యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు చాలా ప్లస్ అవుతాయని అంటున్నారు.