సురేష్ బాబుతో పెళ్లిచూపులు డైరక్టర్..!

పెళ్లిచూపులు సినిమాతో సంచలన విజయం అందుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ తన రెండో సినిమాకు లైన్ క్లియర్ చేసుకున్నాడు. పెళ్లిచూపులు తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినా వాటినన్నిటిని కాదని సురేష్ బాబుతో తన రెండో సినిమా చేస్తున్నాడు తరుణ్ భాస్కర్. ఇక సురేష్ బాబుకి కథ చెప్పి ఓకే చేయించుకోవడం అంటే అది హిట్ సినిమాకు లైన్ క్లియర్ అయినట్టే. 

ఈ సినిమాకు కాస్ట్ అండ్ క్రూ త్వరలో వెళ్లడిస్తారట. కొన్నాళ్లుగా రీమేక్ సినిమాలు చేస్తున్న సురేష్ ప్రొడక్షన్ ఒర్జినల్ కంటెంట్ తో సినిమా చేసి చాలా రోజులైంది. దర్శకుడు ఎలాగు టాలెంటెడ్ అని ప్రూవ్ అయ్యింది కాబట్టి సురేష్ బాబు సినిమా మీద మంచి నమ్మకంతో ఉన్నాడట. స్క్రిప్ట్ వరకు ఫైనల్ అవడంతో ఇక త్వరలోనే సినిమా గురిచి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ చేస్తారని తెలుస్తుంది.