
హిందిలో సక్సెస్ అయిన బిగ్ బాస్ రియాలిటీ షోని సౌత్ భాషలకు తీసుకొచ్చారు. తమిళంలో కమల్ హాసన్ హోస్ట్ గా చేస్తుండగా తెలుగులో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఈ షోకు హోస్ట్ గా ఉంటున్నారు. జూలై 16న మొదటి ఎపిసోడ్ టెలికాస్ట్ అవనుంది. తెలుగులో షో స్టార్ట్ అవడానికి ముందే తమిళంలో బిగ్ బాస్ మీద పెద్ద గొడవే జరుగుతుంది. ఏకంగా ఈ షో హోస్ట్ చేస్తున్న కమల్ హాసన్ ను అరెస్ట్ చేయాలంటూ తమిళనాడులోని కొన్ని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
తమిళంలో ఆ షోకి వస్తున్న నెగటివ్ రెస్పాన్స్ చూసి షాక్ అయిన నిర్వాహకులు తెలుగులో కూడా అలాంటి నెగటివ్ టాక్ వస్త్తే ఎలా అని ఆలోచనలో పడ్డారట. అందుకే రియాలిటీ షోలో కొన్ని మార్పులు చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ ప్రెస్ మీట్ లో తెలుగు ఆడియెన్స్ సెన్సిబిలిటీని బట్టే ఈ ప్రోగ్రాం ఉంటుందని తారక్ అన్నాడు కాబట్టి కచ్చితంగా తెలుగులో ఆ స్థాయిలో గొడవలు జరుగకపోవచ్చని అంటున్నారు. ఏదైనా సరే బిగ్ బాస్ ఒక్క ఎపిసోడ్ నడిస్తే కాని షోని ఇక్కడ జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది చెప్పగలం.