ఫిదా ఫోకస్ మొత్తం ఆమెపైనే..!

మెగా హీరో వరుణ్ తేజ్, మలయాళ భామ సాయి పల్లవి లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా ఫిదా. కొద్దిపాటి గ్యాప్ తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. జూలై 21న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ఆడియో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఆడియో వేడుకలో.. సినిమా ప్రమోషన్స్ లో సినిమా యూనిట్ మొత్తం హీరోయిన్ సాయి పల్లవి మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారు.

తెలంగాణా అమ్మాయిగా అదే యాసతో సాయి పల్లవి నటన కచ్చితంగా ఆకట్టుకుంటుందని అంటున్నారు. హీరోగా వరుణ్ తేజ్ ఉన్నా సినిమాలో ఎక్కువ ప్రాధాన్యత ఆమెకే ఇచ్చారని టాక్. మలయాళ ప్రేమంలో మలార్ గా నటించి మెప్పించిన సాయి పల్లవి తెలుగులో ఫిదాతో ఎంట్రీ ఇస్తుంది. మరి అంచనాలను అందుకునేలా ఫిదా అటు వరుణ్ కు.. ఇటు సాయి పల్లవికి సూపర్ హిట్ ఇస్తుందో లేదో చూడాలి.