
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం చేస్తున్న సినిమా జై లవకుశ. కె.ఎస్. రవింద్ర డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన జై టీజర్ ఎంతగానో ఆకట్టుకోగా సినిమా బిజినెస్ కు ఆ టీజర్ ఒక్కటే సరిపోదు అంటున్నారట. పవర్ సినిమాతో దర్శకుడిగా ఓకే అనిపించుకున్న బాబి పవర్ స్టార్ తో సర్దార్ గబ్బర్ సింగ్ డిజాస్టర్ అయ్యింది.
ఇక కెరియర్ లో చేసిన రెండు సినిమాలు అంతగా ప్రభావితం చూపలేదు. అందుకే బాబిని చూసి బయ్యర్లు భయపడుతున్నారట. అయితే ఎన్.టి.ఆర్ మాత్రం మరోసారి ఈ సినిమాతో తన సత్తా చాటడం ఖాయమని అంటున్నారు. సినిమాలో మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్న తారక్ మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపిస్తాడని తెలుస్తుంది. సెప్టెంబర్ 21న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.