సిక్స్ ప్యాక్ తో షాక్ ఇస్తున్న రోహిత్..!

నారా వారి ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో నారా రోహిత్. బాణం నుండి రాబోతున్న శమంతకమణి దాకా రోహిత్ డిఫరెంట్ సినిమాలు చేస్తున్నాడని చెప్పడానికి ఉదాహరణ. సినిమాలైతే ఆడియెన్స్ ను మెప్పించేలా వస్తున్నా తన లుక్ విషయంలో మాత్రం చూస్తూ చూస్తూనే లావై పోయాడు. అయితే తన పర్సనాలిటీ మీద దృష్టి పెట్టిన రోహిత్ ప్రస్తుతం సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తున్నాడట.

ఈ వారం రాబోతున్న శమంతకమణి, ఆ తర్వాత రాబోతున్న కథలో రాజకుమారి సినిమాల్లో రోహిత్ సిక్స్ ప్యాక్ కనిపించదు కాని.. పవన్ సినిమాలో మాత్రం సిక్స్ ప్యాక్ ట్రై చేశాడట నారా రోహిత్. దీని కోసం గంటల తరబడి జిం లోనే ఉన్న రోహిత్ 1,2 కాదు ఏకంగా 21 కిలల బరువు తగ్గాడని అంటున్నారు. మరి రాబోతున్న సినిమాల్లో నారా రోహిత్ సర్ ప్రైజ్ లుక్స్ చూసే అవకాశం ఉన్నదన్నమాట.