
సౌత్ లో సూపర్ క్రేజ్ సంపాదించిన హీరోయిన్స్ ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంది. కొందరు కేవలం గ్లామర్ రోల్ కే పరిమితమవగా కొందరు మాత్రం ప్రయోగాలతో ప్రేక్షకులను అలరించారు. ఇక ఇన్నాళ్లు తనకు వచ్చిన నచ్చిన పాత్రలను చేస్తూ వచ్చిన కాజల్ కెరియర్ లో మొదటిసారి ఫీమేల్ ఓరియెంటెడ్ రోల్ చేసేందుకు సిద్ధమైందట. చంద్రముఖి దర్శకుడు పి.వాసు డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమా కాజల్ కెరియర్ లో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని నమ్ముతుంది.
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను తీయడంలో వాసుది అందవేసిన చెయ్యి. ఇక ఇప్పుడు అదే క్రమంలో మరొ పకడ్బందీ కథతో వస్తున్నారట. ఇందులో హీరోయిన్ గా కాజల్ ను ఫైనల్ చేశారని తెలుస్తుంది. చంద్రముఖిలో జ్యోతిక పాత్ర తరహాలో కాజల్ రోల్ ఉంటుందని అంటున్నారు. మరి ఇన్నాళ్లు తన గ్లామర్ తో అలరించిన కాజల్ అభినయంతో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కే ఈ సినిమా గురించి మరిన్ని డీటేల్స్ త్వరలో వెళ్లడయ్యే అవకాశాలున్నాయి.