
సీనియర్ నటి తులసి రీసెంట్ గా మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ (మా) అధ్యషుడు శివాజి రాజని జోకర్ అని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ట్విట్టర్ వేదికగా ఆమె చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఆమెను రిస్క్ లో పడేశాయి. తులసి మొదలు పెట్టిన శంకరాభరణం అవార్డులకు స్టార్స్ ను రానివ్వకుండా మా అధ్యక్షుడు అడ్డు పడుతున్నాడని.. ఉపయోగపడే పనులు చేయాల్సిన ఆ పదవిని దుర్వినియోగం చేస్తున్నాడని శివాజి రాజా మీద ధ్వజమెత్తింది తులసి.
తులసి కామెంట్లకు శివాజిరాజా కౌంటర్లేమి ఇవ్వలేదు. కనీసం ఈ విషయం గురించి ఎక్కడ స్పందించలేదు. అయితే తులసి చేసిన వ్యాఖ్యలకు బాగా హర్ట్ అయిన శివాజి రాజా ఆమెపై పరువు నష్టం దావా వేయాలని ఫిక్స్ అయ్యాడట. ఇప్పటికే లీగల్ అడ్వైజర్స్ తో సంప్రదింపులు జరిపారట. అయితే విషయం తెలిసుకున్న తులసి అసలు తాను శివాజి రాజాను ఏమి అనలేదని.. ట్విట్టర్ యాండిల్ తన చేతిలో లేదని మాట మార్చేసింది. ఏది ఏమైనా మా అధ్యక్షుడిగా ఉన్న శివాజి రాజాపై అనరాని మాటలను అన్నందుకు తులసి పై మా యాక్షన్ తీసుకునే ఆలోచనలో ఉందట. మరి ఈ వ్యవహారం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.