టీజర్ తో అంచనాలు పెంచేశారు..!

సక్సెస్ ఫుల్ డైరక్టర్ బోయపాటి శ్రీను కుర్ర హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో చేస్తున్న సినిమా జయ జానకి నాయకా. ద్వారకా క్రియేషన్స్ పతాకంలో మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు సంబందించిన టీజర్ కొద్దిగంటల క్రితం రిలీజ్ అయ్యింది. సాధారణంగా బోయపాటి సినిమాలన్ని హీరో పవర్ ఫుల్ గా రక్తపాతం ఎక్కువ కలిగి ఉంటాయి.

బెల్లంకొండ శ్రీనివాస్ తో తీస్తున్న జయ జానకి నాయకా సినిమా బోయపాటి కొత్తగా ట్రై చేసినట్టు ఉన్నాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా టీజర్ అంచనాలను పెంచేసింది. ఆగష్టు 11న రిలీజ్ అవుతున్న ఈ సినిమా పోటీగా వస్తున్న సినిమాలను సైతం ఢీ కొట్టడానికి వస్తుంది. లాస్ట్ ఇయర్ సరైనోడుతో సంచలన విజయం అందుకున్న బోయపాటి జయ జానకి నాయకా సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.