ఉయ్యాలవాడ ముహుర్తం ఫిక్స్..!

ఖైది నంబర్ 150 తర్వాత మెగాస్టార్ నటించబోతున్న సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి డైరక్టర్ గా రాబోతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో రాం చరణ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా అసలైతే ఆగష్టు 22న చిరు బర్త్ డే రోజు స్టార్ట్ చేస్తారని అన్నారు. కాని స్వాతంత్ర్య సమరయోధుని చరిత్ర కాబట్టి సినిమాను ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్టార్ట్ చేయాలని చూస్తున్నారు.

ఇక ఆగష్టు 22న కూడా కొన్ని సర్ ప్రైజులు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారట చిత్రయూనిట్. ఇక మూవీలో హీరోయిన్స్ గా ఐశ్వర్య రాజ్, నయనతారలు ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించబోయే ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కిస్తారట. మరి మెగాస్టార్ 151వ సినిమాగా రాబోతున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.