
సూపర్ స్టార్ రజినికాంత్ క్రేజీ డైరక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 2.ఓ. రోబో సీక్వల్ గా రాబోతున్న ఈ సినిమా 400 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతుంది. షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. 2018 జనవరి 25న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ఆడియో ఈ అక్టోబర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఇక ఈ ఆడియోకి కూడా దాదాపు పాతిక కోట్ల ఖర్చుతో చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆడియో వేడుక 25 కోట్లని ఆశ్చర్యపోవచ్చు. దుబాయ్ లో జరిగే 2.ఓ ఆడియో కోసం అంత పెట్టేస్తున్నారట. కొంతమంది హాలీవుడ్ హీరోలను ఆడియో రిలీజ్ కు పిలిపించాలని చూస్తున్నారు. అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రజిని మూడు పాత్రల్లో కనిపిస్తారని టాక్.