
యంగ్ హీరో నితిన్ హీరోగా హను రాఘవపుడి డైరక్షన్ లో వస్తున్న సినిమా లై. కోట్లమంది సైనికులు సరిపోలేదట.. పంచపాండవులూ సాధించలేదట.. చివరికి కృష్ణుడూ ఒంటరి కాదట.. అబద్ధం తోడు లేకుండా ఏ కురుక్షేత్రం పూర్తవదట, అశ్వాత్థామ హత:కుంజర: అంటూ టీజర్ తో సినిమా మీద అంచనాలను పెంచేశారు. నితిన్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్న ఈ సినిమాలో మేగా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక సినిమాలో మరో స్పెషల్ థింగ్ ఏంటి అంటే యాక్షన్ హీరో అర్జున్ ఈ సినిమాతో విలన్ గా కొత్త టర్న్ తీసుకోవడమే. ఒకపటి స్టార్ హీరోలకు విలన్ గా ఇప్పుడు మంచి గిరాకి ఉంది. ఆల్రెడీ జగపతి బాబు విలన్ గా ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఇక అదే దారిలో హీరో శ్రీకాంత్ కూడా నాగ చైతన్య సినిమాతో విలన్ గా మారాడు. ఇక ఇప్పుడు అర్జున్ కూడా లైతో తెలుగులో విలన్ గా కనిపించబోతున్నారు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ బ్యానర్లో రాం ఆచంట, గోపి ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. ఆగష్టు 11న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా నితిన్ కు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.