
క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇన్నాళ్లకు పవర్ స్టార్ తో నటించే ఛాన్స్ దక్కించుకుంది. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితో నటించిన రకుల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన కూడా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన అభిమాన హీరో పవన్ తో ఒక్క సినిమా అయినా చేయాలని కలలు కన్న రకుల్ ఆ ఛాన్స్ త్వరగానే దక్కించుకుంది.
ప్రస్తుతం త్రివిక్రం శ్రీనివాస్ డైరక్షన్ లో సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత సంతోష్ శ్రీనివాస్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కబోతుంది. పవన్ తో కూడా నటిస్తే ఈతరం స్టార్ హీరోలందరితో రకుల్ నటించేసినట్టే. ప్రభాస్ తో సాహోలో అమ్మడిపేరే వినబడుతుంది.