కొరటాలతో కన్ఫాం చేసిన చరణ్..!

సక్సెస్ ఫుల్ డైరక్టర్ కొరటాల శివ లాస్ట్ ఇయర్ ఎన్.టి.ఆర్ తో జనతా గ్యారేజ్ తో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం మహేష్ తో భరత్ అను నేను సినిమా సెట్స్ మీద ఉండగా ఆల్రెడీ ఎన్.టి.ఆర్ తో మరో సినిమా ముహుర్తం పెట్టాడు. ఇక ఇవే కాకుండా మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో కూడా ఓ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు కొరటాల శివ.


2018 సమ్మర్ లో మొదలు పెట్టబోతున్న ఈ సినిమా అఫిషియల్ కన్ఫర్మేషన్ ఈరోజు ఎనౌన్స్ చేశారు.. వరుస విజయాలతో దూసుకెళ్తున్న కొరటాల శివ చరణ్ తో ఇదవరకే స్టోరీ డిస్కషన్స్ జరిపినా ఎందుకో వారిద్దరి కలిసి పనిచేయడం కుదరలేదు. ఇక ఇన్నాళ్లను చరణ్ తో శివ సినిమా ఫిక్స్ చేసుకున్నారు. మాటినీ ఎంటర్టైన్మెంట్ పతాకంలో నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో రాం చరణ్ కూడా ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్ గా ఉంటారని తెలుస్తుంది.