
మెగా హీరో వరుణ్ తేజ్ సాయి పల్లవి కలిసి నటించిన సినిమా ఫిదా. శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా దిల్ రాజు నిర్మించడం విశేషం. నిన్న ఆడియో రిలీజ్ జరుపుకున్న ఈ సినిమా ఆడియో వేడుకలో వరుణ్ తేజ్ ఫిదా పక్కా హిట్ అని చెప్పుకొచ్చాడు. ఇక తన ప్రతి ఫంక్షన్ కు మెగాస్టార్, పవర్ స్టార్ ఎవరో ఒక మెగా హీరో వస్తుండటం కామనే కాని ఫిదా ఆడియోకి కేవలం తమ కాస్ట్ అండ్ క్రూతోనే రిలీజ్ చేయాలని భావించాం.
అయినా సరే తనని అభిమానించి ఇక్కడకు వచ్చిన మెగా ఫ్యాన్స్ అందరికి థ్యాంక్స్ అన్నారు వరుణ్ తేజ్. ఫ్యాన్స్ కూడా తనని మంచి మంచి సినిమాలు చేయమని సలహాలు ఇస్తున్నారని. తప్పకుండా ఇక నుండి చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తానని అన్నారు వరుణ్ తేజ్. జూలై 21న రాబోతున్న ఫిదా మూవీ హిట్ గ్యారెంటీ అన్న కాన్ఫిడెన్స్ వరుణ్ తేజ్ మాటల్లో అర్ధమవుతుంది. మరి కమర్షియల్ సక్సెస్ లో వెనుకపడ్డ వరుణ్ తేజ్ నిజంగా ఈ ఫిదాతో సూపర్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.