పవన్ సినిమా రికార్డ్ శాటిలైట్ రైట్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా సెట్స్ మీద ఉంది. టైటిల్ కూడా డిసైడ్ అవని ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం భారీ రేంజ్ లో జరుగుతుంది. ఇక శాటిలైట్ రైట్స్ లో సంచలన రికార్డ్ అందుకుంది పవన్ సినిమా. తెలుస్తున్న సమాచారం ప్రకారం జెమిని టివి 19.50 కోట్లకు సినిమా రైట్స్ కొనేసిందట. 

ఓ విధంగా బాహుబలి తర్వాత ఇంత భారీ రేంజ్ లో శాటిలైట్ అందుకున్న సినిమా ఇదే అని చెప్పొచ్చు. త్రివిక్రం పవన్ కాంబినేషన్ లో జల్సా, అత్తారింటికి దారేది ఈ రెండు మంచి హిట్ సాధించాయి. అత్తారింటికి దారేది ఇండస్ట్రీ రికార్డ్ సాధించడమే కాకుండా బుల్లితెర మీద కూడా సినిమా ఎప్పుడొచ్చినా మంచి టి.ఆర్.పి రేటింగ్ వచ్చేది. అందుకే జెమిని టివి దగ్గర దగ్గర 20 కోట్లు పెట్టి పవన్ సినిమా శాటిలైట్ రైట్స్ అందుకుంది.

ఇప్పటిదాకా మహేష్ మురుగదాస్ సినిమానే జీ సినిమా వాళ్లు తెలుగు, హింది రైట్స్ కలిపి 25 నుండి 30 కోట్ల దాకా కొన్నారని తెలుస్తుంది. ఇప్పుడు ఆ రికార్డ్ చెరిపేస్తూ కేవలం ఒక్క తెలుగు సినిమా రైట్సే 19 కోట్లకు పైగా అమ్ముడవడం పవర్ స్టామినాను ప్రూవ్ చేస్తుంది.