
అక్కినేని నాగ చైతన్య, సమంత ఇద్దరు అక్టోబర్ లో పెళ్లిచేసుకోబోతున్నారని తెలిసిందే. ఈ ఇయర్ మొదట్లో ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఈ ఇద్దరు అక్టోబర్ 6న ఒకటవబోతున్నారు. అయితే సెప్టెంబర్ నుండి పెళ్లిపనుల్లో బిజీగా ఉండే చైతు సమంత పెళ్లి పట్ల ఫ్యాన్స్ చాలా ఎక్సయిటింగ్ గా ఉన్నారు. ఇదే విషయాన్ని ట్విట్టర్ లో చెబుతూ చైతుతో తన పెళ్లి ఎప్పుడో జరిగింది అంటూ షాక్ ఇచ్చింది.
నేను ఆల్రెడీ చైతుని పెళ్లి చేసుకున్నాను.. మేమిద్దరం ఇప్పటికే భార్యాభర్తం.. నా మనసు అలానే చెబుతుంది.. అయితే మా ఇద్దరి కంటే మా పెళ్లి గురించి మిగతా వాళ్లకు ఎక్కువ ఆసక్తి కనబడుతుంది అంటూ ఓ ఫ్యాన్ ట్వీట్ కు షాకింగ్ రిప్లై ఇచ్చి అందరిని అవాక్కయ్యేలా చేసింది సమంత. ఇక ట్విట్టర్ సంభాషణలో భాగంగా పెళ్లి చేసుకున్నా సరే సినిమాలను కంటిన్యూ చేస్తానని.. తను స్థాపించిన ప్రత్యూష ఫౌండేషన్ కూడా ఎప్పటిలానే నడుస్తుందని సమంత కన్ ఫాం చేసింది.