
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత చేస్తున్న సినిమా సాహో. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా 150 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామలను సెట్ చేస్తున్నా బాహుబలి క్రేజ్ కలిసి వస్తుందని అనుష్కని ఫైనల్ చేశారని అన్నారు. అయితే యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న సాహోలో హీరోయిన్ గ్లామరస్ గా మాత్రమే కాదు బబ్లీగా కూడా ఉండాలి.
అందుకే అనుష్క సైజ్ ఇంకాస్త తగ్గాలని సూచించారట. తను ఎంత ప్రయతించినా తగ్గకపోవడంతో సాహో నుండి అనుష్కను తప్పించే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు. హీరోయిన్ గా మంచి ఫాంలో ఉన్న అనుష్క సైజ్ జీరో కోసం బరువు పెరిగిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సరిగా ఆడలేదు సరికదా అనుష్క అవకాశాలను కూడా చేజార్చుకునేలా చేస్తుంది.
ప్రస్తుతం అనుష్క భాగమతి సినిమా చేస్తుంది. సినిమా ఆల్రెడీ పూర్తయిందని అంటున్నారు. ప్రభాస్ తో అనుష్క హాట్ పెయిర్ అయినా సరె సాహోలో ఈ జంట కనిపిస్తుందా లేదా అన్నది మరికొద్ది రోజుల్లో ఫైనల్ గా తెలుస్తుంది.