
నాచురల్ స్టార్ నాని తెలంగాణా రాష్ట్ర ఐటి, పంచాయితీ రాజ్ శాఖా మంత్రి కె. తారక రామారావు దగ్గర నుండి ప్రశంసలు అందుకున్నాడు. ఈమధ్య వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని స్టార్ హీరోలకు షాక్ ఇస్తూ వరుసగా 7 సినిమాలను కంటిన్యూ హిట్ అందుకున్నాడు. రీసెంట్ గా నాని నిన్ను కోరి కూడా ప్రేక్షకుల మెప్పు పొందింది. శివ నిర్వాణ డైరక్షన్ లో వచ్చిన నిన్ను కోరి సెంటర్లతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇక ఈమధ్యనే వారంతరం నాని సినిమాలను చూసిన కె.టి.ఆర్ గారు నాని నటనకు ఇంప్రెస్ అయ్యారట. ఈతరం నటుల్లో నాని కూడా అద్భుతమైన నటుడని. నాని నటించిన కొన్ని సినిమాలు ఈమధ్యనే చూశానని బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అని అన్నారు కె.టి.ఆర్. తన పనుల ఒత్తిడిలో ఉన్నా సరే సినిమా పరిశ్రమకు కాస్త దగ్గరగా ఉంటున్న కె.టి.ఆర్ గారు పరిశ్రమ మేలు కోసం కూడా తాను ముందుంటానని మునుపటి కార్యక్రమాల్లో చెప్పారు. ఇక వరుస హిట్లు మాత్రమే కాదు రాజకీయ నాయకులను కూడా తన అభిమానులుగా చేసుకుంటున్న నాని నాచురల్ నటన ఇలానే కంటిన్యూ అవుతూ మరిన్ని హిట్లు కొట్టాలని ఆశిద్దాం.