పూరి కథ ఎన్టీఆర్ కొట్టేశాడా..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించిన జై లవకుశ టీజర్ ఎన్ని సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. 48 గంటలు కాకముందే 10 మిలియన్ అంటే కోటి వ్యూస్ తో కేక పెట్టించిన తారక్ జై పాత్రలో చూపించిన విలనిజం వారెవా అనేలా చేసింది. అయితే ఈ పాత్రతో కూడిన ఓ కథను పూరి రాసుకున్నాడని.. దాని రిఫరెన్స్ తో జై క్యారక్టర్ వచ్చిందని అసంతృప్తితో ఉన్నాడట క్రేజీ డైరక్టర్ పూరి జగన్నాధ్.


టెంపర్ తర్వాత పూరి తారక్ కోసం ఓ కథ రాసుకున్నాడట. అది అచ్చం జై లవకుశ టీజర్ లో చూపించిన ఎన్.టి.ఆర్ జై క్యారక్టరైజేషన్ తోనే ఉంటుందట. తన కథ విని బాబితో సినిమా చేస్తున్నాడని పూరి హర్ట్ అయిన విషయాన్ని ఓ ఆంగ్ల పత్రిక కథనం రాసింది. ఎన్.టి.ఆర్ స్క్రిప్ట్ కొట్టేశారని రాశారు. అయితే ఈ విషయం పట్ల అటు తారక్ ఇటు పూరి కాని స్పందించకపోవడం విశేషం.