విజయ్ తో లావణ్య లక్కీ ఛాన్స్..!

టైటిల్ చూసి లావణ్యకు ఇళయదళపతి విజయ్ పక్కన నటించే ఛాన్స్ వచ్చిందని అనుకోవచ్చు. ఇక్కడ విజయ్ అంటే కోలీవుడ్ విజయ్ కాదు టాలీవుడ్ హీరో విజయ్.. పెళ్లిచూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విజయ్ టాలీవుడ్ లో బిజీ హీరోగా మారాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాలే కాకుండా విజయ్ దేవరకొండ ప్రెస్టిజియస్ గీతా ఆర్ట్స్-2 బ్యానర్లో సినిమా కన్ఫాం అయ్యింది. 

పరశురాం డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠిని సెలెక్ట్ చేశారని తెలుస్తుంది. ఇప్పటికే పరశురాం డైరక్షన్ లో లాస్ట్ ఇయర్ వచ్చిన శ్రీరస్తు శుభమస్తులో లావణ్యనే హీరోయిన్ గా చేసింది. ఇక కాంబినేషన్ కుదరడంతో మళ్లీ పరశురాం లావణ్యనే హీరోయిన్ గా తీసుకున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఛాన్స్ దక్కించుకుని కెరియర్ గాడిలో పడేసుకున్న లావణ్య స్టార్ హీరోయిన్ గా మాత్రం క్రేజ్ తెచ్చుకోవట్లేదు. ఈమధ్య అమ్మడు కాస్త హాట్ లుక్స్ తో ఇంప్రెస్ చేస్తున్నా స్టార్ హీరో అవకాశాలు మాత్రం తలుపు తట్టట్లేదు. మరి విజయ్ తో సినిమా లావణ్యకు అలాంటి ఛాన్స్ వచ్చేలా హిట్ ఇస్తుందేమో చూడాలి.