చంచల్ గూడ జైల్లో అల్లు శిరీష్

అల్లు అరవింద్ రెండో తనయుడు అల్లు శిరీష్ ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్నాడు. అయ్యో అవునా ఏం చేశాడని అల్లు శిరీష్ ను జైలుకి తీసుకెళ్లారు అంటే. ఇదంతా రియల్ లైఫ్ లో కాదు లేండి రీల్ లైఫ్ కోసం శిరీష్ చంచల్ గూడ జైల్ కు వెళ్లాడని తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ శ్రీరస్తు శుభమస్తు సినిమాతో హిట్ అందుకున్న శిరీష్ ప్రస్తుతం విఐ ఆనంద్ తో సినిమా చేస్తున్నాడు. సినిమా టైటిల్ గా ఏ నిమిషానికి ఏమి జరుగునో అని ఫిక్స్ చేశారు.   


లాస్ట్ ఇయర్ నిఖిల్ తో ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో హిట్ అందుకున్న దర్శకుడు విఐ ఆనంద్ ఈ సినిమాను హిట్ చేసుకునేందుకు కష్టపడుతున్నాడు. సినిమాలో కొన్ని జైల్ సీన్స్ ఉండగా వాటిని చంచల్ గూడలో షూట్ చేస్తున్నారట. సురభి, సీరత్ కపూర్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు. రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సిన్మా డిసెంబర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్.